Dwayne Bravo to K Paul, no run, tailing in with a fuller delivery, Paul is beaten for pace and gets rapped on the pad. Bravo goes up for a massive LBW shout but umpire Nitin Menon shakes his head.
#IPL2019
#Chennaisuperkings
#DelhiCapitals
#msdhoni
#rishabpanth
#shreyashiyar
#shikardhawan
#ambatirayudu
#cricke
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వికెట్ల వెనుక ఎంత చురుగ్గా వ్యవహరిస్తాడో అందరికీ తెలిసిందే. టోర్నీలో భాగంగా మంగళవారం రాత్రి ఫిరోజ్ షా కోట్ల వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని వికెట్ కీపింగ్‌లో తన మార్క్‌ని మరోసారి చూపించాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ధోని, బౌలర్ డ్వేన్ బ్రావోల మధ్య చోటు చేసుకున్న సంఘటన ఒకటి ఆసక్తికరంగా మారింది.ఈ మ్యాచ్‌లో ఓ సందర్భంలో ధోనీని డీఆర్‌ఎస్ అడగమని చెప్పిన డ్వేన్ బ్రావో ఒక్క కనుసైగతో సైలెంట్‌గా వెనక్కి వెళ్లిపోయాడు. ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసిన చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ డ్వేన్ బ్రావో బౌలింగ్‌లో బంతిని హిట్ చేసేందుకు ప్రయత్నించిన ఢిల్లీ బ్యాట్స్‌మెన్ కీమా పాల్ విఫలమయ్యాడు. బ్యాట్‌కి అందని బంతి నేరుగా వెళ్లి పాల్ ఫ్యాడ్స్‌ను తాకగా ఎల్బీ కోసం బౌలర్ బ్రావోతో పాటు చెన్నై ఫీల్డర్లు అప్పీల్ చేశారు.